Breaking News

వినతిపత్రాలు ఇస్తేనే సరిపోదు

వినతిపత్రాలు ఇస్తేనే సరిపోదు
  • మంత్రి హరీశ్​ రావు విమర్శలు

సారథి న్యూస్, మెదక్: తాము రైతుల పక్షాన పనిచేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఏసీ రూముల్లో కూర్చుని ఏవేవో మాట్లాడుతున్నారని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు విమర్శించారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ప్రజల మధ్య తిరగాలని, హైదరాబాద్ లో కూర్చుని గవర్నర్ కు వినతిపత్రాలు ఇస్తే సరిపోదని హితవు పలికారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

అనంతరం నర్శరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా వారు పండించిన ధాన్యమంతా కొనుగోలు చేశామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు తమ పంటలు అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నానని అన్నారు. కర్ణాటకలో ప్రభుత్వం శనగలు కొనడం లేదని, బీదర్ రైతులు నారాయణఖేడ్, జహీరాబాద్ కు తెచ్చి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు.