సారథి న్యూస్, మహబూబ్ నగర్: చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు, ఆ వృత్తిదారులను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సోమవారం చేనేత వస్త్రాలు ధరించారు. సాధారణంగా తెల్లటి వస్త్రధారణలో కనిపించే మంత్రి ఇలా కొత్త గెటప్‌లో కనిపించారు. తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.
- June 29, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- KTR
- V.SRINIVASGOUD
- చేనేత
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- మహబూబ్ నగర్
- Comments Off on మంత్రి కొత్త గెటప్