ఢిల్లీ: కుటుంబ సమస్యలతో ఓ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను మంచి భర్తగా, మంచి కుటుంబసభ్యుడిగా ఉండలేకపోతున్నానని చనిపోయేముందు ఓ సెల్ఫీ వీడియోను తీసుకున్నాడు. హర్యానాలోని జాజర్‌కు చెందిన సందీప్ కుమార్ వసంత విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ సమస్యలతో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. తోటి సిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచాడు. సందీప్ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సందీప్ మృతిపై స్పందించేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- June 21, 2020
- Archive
- క్రైమ్
- జాతీయం
- DELHI
- FAMILY
- POLICE
- SUICIDE
- సెల్ఫీ వీడియో
- స్పెషల్ బ్రాంచ్
- Comments Off on మంచి భర్తగా ఉండలేక..