Breaking News

భిక్షాటన చేసైనా రైతులను ఆదుకుంటా

సారథిన్యూస్​, తల్లాడ: భిక్షాటన చేసైనా రైతులను ఆదుకుంటానని ఎస్సీ కార్పొరేషన్​ మాజీ చైర్మన్​, సత్తుపల్లి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి పిడమర్తి రవి భరోసా వాఖ్యానించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లోని మిట్టపల్లి గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. అనంతరం రైతులకు వ్యక్తిగతంగా రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, దుడేటి వీరారెడ్డి, అనుమోలు బుద్ధి సాగర్, ఎర్రమల వెంకటేశ్వర్ రెడ్డి, తుమ్మలపల్లి రమేశ్​, నరసింహారావు, రవి, ఎంపీటీసీ కొమ్మినేని ప్రభాకర్ రావు, లక్ష్మీనారాయణ, మాజీ జెడ్పీటీసీ మూకర ప్రసాద్, ఆశీర్వాదం, దుర్గారావు, శీను, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.