Breaking News

భారీవర్షాలు.. శ్రీశైలం దారిలో కూలిన రక్షణ గోడ

భారీవర్షాలు.. శ్రీశైలం దారిలో కూలిన రక్షణ గోడ

సారథి న్యూస్, అచ్చంపేట: కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ఘాట్​రోడ్డులో నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూరు సమీపంలోని దర్గా వద్ద రక్షణగోడ శనివారం కూలింది. సమాచారం అందుకున్న అమ్రాబాద్‌ పోలీసులు శ్రీశైలం మార్గంలో వాహనాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు. నాలుగైదు రోజులుగా నల్లమల అటవీప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాన నీటికి రక్షణ గోడ కోతకు గురైందని భావిస్తున్నారు. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో కరోనా కలకలం సృష్టించగా, భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. శనివారం నుంచి దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా పెరిగింది. అలాగే ప్రాజెక్టును చూసేందుకు పెద్దసంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో రక్షణ గోడ కూలిన వద్ద అధికారులు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా అన్నిజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.