సారథి న్యూస్, వర్ధన్న పేట : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట, రాయపర్తితో పాటు చుట్టు పక్కల గ్రామీణా ప్రాంతాల్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా బ్యాగుల సరఫరాకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి సుమారు రూ.8.10 లక్షల విలువగల గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వర్ధన్నపేట ఏసీపీ రమేశ్ వివరాలను వెల్లడిస్తూ.. గుమ్మడవెల్లి నాగరాజు అలియాస్ ఉప్పల్ నాగరాజు అలియాస్ తొర్రూరు నాగరాజు అలియాస్ ఉప్పల్ మధు(45), ఉప్పల్ నివాసి. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని బీదర్, ఇతర రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల నుంచి గుట్కాను హైదరాబాద్ తీసుకువచ్చి ఉప్పల్ గోడౌన్లో నిల్వ చేసి ఇతర జిల్లాల వారికి రహస్యంగా సరఫరా చేస్తూ తన అక్రమ కార్యకలాపాల నిర్వహిస్తున్నాడు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అతడిపై గతంలో వర్ధన్నపేట లో 2, రాయపర్తి లో 4 కేసులున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉండి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. జనగాం డీసీపీ శ్రీనివాస్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు వర్ధన్నపేట సీఐ విశ్వేశ్వర్, సర్కిల్ ఎస్సైలు వంశీకృష్ణ, రాజ్ కుమార్, కిషోర్ కుమార్ కొద్ది రోజులుగా నిందితుడిపై నిఘా పెట్టి ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో నిందితుడు నాగరాజు సహచరుడు కొత్త నాగేశ్వరరావులను గుట్కా అమ్మే క్రమంలో బైక్‌పై గుట్కా సరఫరా చేయడానికి వర్ధన్నపేట మండలం లోని ఇల్లంద వెళ్తుండగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు బృందాలు పట్టుకున్నాయి. అతడి నుంచి సుమారు రూ.60 వేల విలువైన నిషేధిత గుట్కా, బైక్ ను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అంతేకాక అతడి నుంచి సేకరించిన సమాచారం మేరకు హైదరాబాద్లో ఉప్పల్ లో నిల్వ ఉంచినరూ. 8.10 లక్షల విలువైన గుట్కాలను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. వర్ధన్నపేట ఏసీపీ గోళ్ల రమేష్ మాట్లాడుతూ ఈ టాస్క్ లో ప్రతిభ కనబర్చిన ఎస్ఐ వంశీ కృష్ణ, కానిస్టేబుల్స్ సురేష్, రమేష్, డ్రైవర్ నజీర్, హోమ్ గార్డ్స్ రాజు, ఈశ్వర్ మరియు ఇతర సిబ్బందిని ప్రశంసించారు.
- July 28, 2020
- Archive
- క్రైమ్
- తెలంగాణ
- వరంగల్
- CASE
- GUTKA
- VARDHANNAPET
- కేసు
- గుట్కా
- వర్ధన్నపేట
- Comments Off on భారీగా గుట్కా పట్టివేత