గ్లామర్‌తోనే కాకుండా యాక్టింగ్‌తో మెప్పించే నటి నివేదా థామస్. ‘జెంటిల్ మన్’లో నాని సరసన చేసి టాలెంట్ ఉన్న హీరోయిన్గా మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత ‘నిన్నుకోరి’, ‘బ్రోచేవారెవరురా’.. తమిళంలో దర్బార్చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన నాని, సుధీర్‌బాబు సినిమా‘వి’లో కీలకపాత్ర పోషించింది. ఆ సినిమా రిలీస్కు సిద్ధంగా ఉంది కూడా. తర్వాత దిల్‌రాజు, బోనీకపూర్ తెలుగులో నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’లో ఓ ముఖ్యపాత్ర చేస్తోంది. ఈ మూవీ ‘పింక్’ హిందీ రీమేక్.
ఇదిలా ఉండగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారి జీఎంబీతో కలిసి మహేష్‌బాబు హీరోగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ‘గీత గోవిందం’ ఫేమ్ పరుశురాం తెరకెక్కిస్తుండగా.. ఇందులో ఓ కీలకపాత్రకు నివేదను తీసుకున్నట్టుగా లేటెస్ట్ టాక్. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఫ్రాడ్స్ బ్యాక్ డ్రాప్ లోఈ సినిమా కథనం ఉండనుంది. ఈ సినిమాలో నివేదను ఎంచుకున్నారంటే ఎంతో ఇంటెన్సిటీ ఉన్న రోల్ అయ్యే ఉంటుంది. కానీ ఇంత వరకూ ఎలాంటి అధికారిక కన్ఫమేషన్ రాలేదు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.