Breaking News

బోల్డ్ రోల్‌ కు శ్రియా సై

కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై యేళ్లు దాటుతున్నా ఏ మాత్రం వన్నె తరగని హీరోయిన్ శ్రియా సరన్. ఏ పాత్ర లోనైనా ఇట్టే ఒదిగిపోవడం ఆమె స్టైల్. పెళ్లి చేసుకుని సెటిలైనా ప్రస్తుత సీనియర్ హీరోలకి ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కూడా. రీసెంట్ గా శ్రియా లీడ్ రోల్ లో నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘గమనం’ ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. ఇంకో వైపు ‘ఆర్ఆర్ఆర్’ భారీ ప్రాజెక్ట్లో కూడా నటిస్తోంది. అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది కూడా. అయితే ఇప్పుడో మరో చాలెంజింగ్ రోల్ కి శ్రియా ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.

హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘అంధాదూన్‌’ సినిమా తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకుడు. హిందీలో టబు పోషించిన పాత్రకి తెలుగులో చాలామంది పేర్లు వినిపించాయి కానీ ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఈ క్యారెక్టర్‌ కోసం శ్రియని సంప్రదించారని తెలిసింది. ఈ విషయం శ్రియ కూడా కన్ఫామ్ చేస్తూ.. అది నిజమేనని.. అయితే తానింకా సైన్ చేయలేదని అంటే,, ‘టబు నటించిన సినిమాలు చూశాను. ఆమె వర్క్ ఎంతో స్ఫూర్తినిస్తుంది. అలాగని ఒకవేళ ఈ రీమేక్‌లో నటిస్తే మాత్రం టబును అనుకరించకుండా, తనదైన నటనతో మెప్పిస్తా..’ అంటూ ఈ చిత్రం నటించడానికి రెడీనే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోల్డ్ రోల్స్ శ్రియా కి కొత్తేమి కాదు. కానీ ఇందులో కాస్త నెగిటివ్ టచ్ ఉన్న రోల్ కావడం విశేషం.