Breaking News

బొలీవియా అధ్యక్షురాలికి కరోనా

బొలీవియా అధ్యక్షురాలికి కరోనా పాజిటివ్‌
  • ఐసోలేషన్‌ నుంచి వర్క్‌ చేస్తానని ట్వీట్‌


బొలీవియా: బొలీవియా ఇంటరిమ్‌ ప్రెసిడెంట్‌ జీనిన్‌ అనెజ్‌ కరోనా బారినపడ్డారు. కరోనా పాజిటివ్ వచ్చిందని, ఐసోలేషన్‌ నుంచి వర్క్‌ చేస్తాను అని ఆమె ట్వీట్‌ చేశారు. రెండోసారి టెస్టులు చేయించుకునే కంటే ముందు 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటానని 53 ఏళ్ల అనెజ్‌ వీడియో మెసేజ్‌లో చెప్పారు. సౌత్‌ అమెరికన్‌ ప్రెసిడెంట్‌లలో వ్యాధి బారిన పడిన రెండో వ్యక్తి అనెజ్‌. బ్రెజిల్‌ ప్రెసిడెంట్‌ బోల్సనారోకు రెండు రోజుల క్రితం వ్యాధి పాజిటివ్‌ వచ్చింది. ఆమె మంత్రి వర్గంలోని మరో నలుగురు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆమె టెస్టులు చేయించుకున్నారని తెలుస్తోంది. లాటిన్‌ అమెరికాలోని రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు డియోస్‌దాడో కాబెల్లోకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మాడ్యురో తర్వాత అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా కాబెల్లో గుర్తింపు పొందారు. బొలీవియాలో ఇప్పటి వరకు 43వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 1500 మంది చనిపోయారు.