లక్నో: మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే ఇటీవల పోలీసులు ఎన్కౌంటర్లో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతడి పోస్ట్‌మార్టం అనంతరం పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వికాస్‌దూబే బుల్లెట్ల గాయాలతో అయిన రక్తస్రావంతోతో చనిపోయాడాని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. కాన్పూర్‌లో జూలై 10న జరిగిన ఎన్కౌంటర్లో దూబే మృతిచెందాడు. దూబేను కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా కారు బోల్తాపడిందని.. ఈక్రమంలో అతడు పారిపోయేందుకు యత్నిస్తుండగా ఎన్కౌంటర్ చేశామని పోలీసులు చెప్పారు. అంతకుముందు తనను అరెస్ట్ చేయడానికి వెళ్లిన ఎనిమిది పోలీసులను వికాస్‌దూబే కాల్చిచంపాడు.
- July 20, 2020
- Archive
- జాతీయం
- CRIMINAL
- ENCOUNTER
- GANGSTAR
- POLICE
- ఎన్కౌంటర్
- పోలీసులు
- Comments Off on బుల్లెట్ గాయాలతోనే దూబే మృతి