వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘అమెరికాలో టెస్టులు చేసిన 24 గంటలకు ఫలితాలు వస్తున్నాయి. ఇది ఒక పనికిమాలిన విధానం. దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. టెస్టులు చేయించుకున్న కరోనా అనుమానితులు ఇష్టమున్నట్టు ప్రజల్లో తిరిగి కరోనాను వ్యాపింపచేస్తారు. దీంతో కరోనా మరింత పెరుగుతుంది. టెస్టులు చేసిన కొన్ని నిమిషాల్లోనే ఫలితాలు రావాలి. కరోనా పేషేంట్లందరనీ క్వారంటైన్ చేయాలి అప్పడే వ్యాధిని అరికట్టవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. మనదేశంలో కరోనా పరీక్షలు చేసిన రెండు రోజులకో, మూడు రోజులకో ఫలితాలు వస్తున్నాయి. దీంతో బిల్ గేట్స్‌కు ఇండియా పరిస్థితి తెలిస్తే ఆయన ఎలా స్పందిస్తారో అని సోషల్ మీడియాలో కొందరు అంటున్నారు.