తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో మళ్లీ ప్రారంభం అయ్యేందుకు ముస్తాబవుతోంది. కంటెస్టెంట్లు ఎవరన్నది గాలింపు మొదలైంది. బుల్లి తెర.. వెండి తెర సెలబ్రిటీలను కొంతమందిని ఓకే చేశారు అని కూడా అంటున్నారు. వారిలో హీరో నందు, సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ, తాగుబోతు రవి, బిత్తరి సత్తి అంటున్నారు. అయితే అసలు హోస్ట్ ఎవరన్నది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. బిగ్ బాస్ మూడో సీజన్ కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ నాలుగో సిరీస్ కు ముందు హోరోయిన్ సమంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు నాగార్జునే హోస్ట్ గా రానున్నారని సమాచారం. అయితే కరోనా ఉధృతి కారణంగా హౌస్‌లోకి పంపే వాళ్లందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతామని..టెస్ట్‌లన్నీ చేశాక నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చాకే.. వాళ్లకి ఈ షోలోకి ఎంట్రీ ఉంటుందట. హౌస్ లోపలికి వెళ్లేవాళ్లే తప్ప వచ్చేవాళ్లు ఉండరు కనుక ఇబ్బందేమీ ఉండదని.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలకి వెళ్లే వారికి ఇదే నియమం వర్తిస్తుందని అంటున్నారు. ఆగస్టులో షో ప్రారంభమవుతుంది. కావునా కంటెస్టెంట్ల ఎంపిక, క్వారంటైన్ ప్రక్రియలు త్వరగా పూర్తిచేయాలని చూస్తున్నారు టీమ్.
- July 2, 2020
- Archive
- సినిమా
- BIGBOSS
- NAGARJUNA
- SAMANTHA
- నాగార్జున
- బిగ్‌బాస్
- రియాల్టీ గేమ్‌షో
- Comments Off on బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు..