Breaking News

బిగ్​బాస్​4లోకి శ్రీరాపాక

మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న బిగ్​బాస్​4లో ఆర్జీవీ పరిచయం చేసిన ‘నగ్నం’ హీరోయిన్​ శ్రీరాపాకకు చోటు దక్కనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఆమె పలు యూట్యూబ్​ చానెళ్లలో బోల్డ్​ కామెంట్స్​ చేస్తున్నట్టు టాక్​. బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఇప్పటికే కంటెస్టంట్ల ఎంపిక ప్రక్రియ మొదలైందని టాక్​. ఈ క్రమంలో ఈ షోలో పాల్గొనేందుకు గాను పలువురు సినీ తారలు పోటీ పడుతున్నారు. అయితే ఈ రేసులో ‘నగ్నం’ హీరోయిన్ శ్రీ రాపాక కూడా ఉన్నట్టు సోషల్​మీడియాలో ఓ వార్త తెగవైరల్​ అవుతున్నది. ఆర్టీజీ రూపొందించిన ‘నగ్నం’ సినిమాతో శ్రీరాపాక ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ యూట్యూబ్ ఛానెల్స్ ఇంటర్వ్యూలో శ్రీ రాపాక చేస్తున్న బోల్డ్ కామెంట్స్ ఆమెను నిత్యం వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి.