Breaking News

బిగ్​బాస్​ మెరుపుతీగ స్పెషల్ సాంగ్

బిగ్​బాస్​ మెరుపుతీగ స్పెషల్ సాంగ్

రీసెంట్ గా ముగిసింది బిగ్​బాస్​ సీజన్ 4. సూపర్ సన్సేషన్ ను క్రియేట్ చేసిన ఈ షోలో మోనాల్ గజ్జర్ కూడా ఓ కంటెస్టెంట్. బిగ్ బాస్ కు రాకముందే మోనాల్ సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. గుజరాతీ గాళ్ అయిన మోనాల్ ఫస్ట్ ‘సుడిగాడు’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠి చిత్రాల్లో నటించింది. మోనాల్ కు తెలుగులో రాని గుర్తింపు ‘వనవరాయన్ వల్లవరాయన్, సిగరం తోడు’ సినిమాలతో తమిళంలో వచ్చింది. కానీ బిగ్ బాస్ షో ద్వారా ఒక్కసారిగా తెలుగు వారి అభిమానాన్ని సంపాదించేసింది. బిగ్​బాస్​ క్రేజ్ ఇంకా తగ్గకముందే మోనాల్ కు సినిమా ఆఫర్ ఒకటొచ్చేసింది కూడా. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ‘అల్లుడు అదుర్స్’లో చాన్స్ కొట్టేసిందట. ఇందులో శ్రీనివాస్ సరసన నభానటేశ్, అనూఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. అయితే మోనాల్ హీరోయిన్ గా కాదుగాని బెల్లంకొండతో కలిసి ఓ పాటకి స్టెప్పులేయనుందట. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ ను ఎంచుకున్నారట. ఫుల్ స్వింగ్​లో షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. అంటే తన ఆటాపాటతో త్వరలోనే మోనాల్ ఆడియన్స్ మంచి ఫీస్ట్ ఇవ్వనుందన్నమాట.