సినిమాల్లో ఎంత ఇన్టెన్సిటీ ఉన్న క్యారెక్టర్లు చేస్తుందో.. సోషల్ మీడియాలో అంతే వివాదాలు సృష్టిస్తుంది కంగనా రనౌత్. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఏఎల్విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. గతేడాది కంగనా నటించిన ‘మణికర్ణిక’ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ సినిమా డబ్బింగ్ తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజై మంచి గుర్తింపు సాధించింది. కంగనా రాణి ఝాన్సీగా అందరినీ మెప్పించింది. దాంతో అచ్చు కంగనా రూపంతో బొమ్మలు తయారు చేశారు ఓ కంపెనీవారు. అదీ రాణి ఝాన్సీ మేకప్‌తో కంగనా రూపంతో బొమ్మలు ఉన్నాయి. వాటి గురించి చెబుతూ.. ‘పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టపడతారు.. చిన్నప్పటి నుంచి వాటిని చూసే పెరుగుతుంటారు. అంతేకాదు దేశభక్తి గురించి.. వీరుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం వారికి ఎంతైనా ఉంటుంది..అలాంటి వారికోసం ఈ బొమ్మలు..’ అంటూ తన బొమ్మలు గురించి చెప్పింది కంగనా. అయితే ఈ బొమ్మల ప్రదర్శన గతంలో కరీనా కపూర్ ముద్దుల కొడుకు తైమూర్ ఖాన్ బొమ్మలతో ప్రారంభమైంది. తర్వాత దీపికా పదుకునే నటించిన ‘పద్మావతి’ సినిమాలోనే దీపికా రూపంతో పద్మావతి గెటప్‌తో బొమ్మలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా కంగనా బొమ్మలు అలరిస్తున్నాయి.
- July 11, 2020
- Archive
- సినిమా
- KANGANA
- SOCIALMEDIA
- TOYS
- కంగనా రనౌత్
- కోలీవుడ్
- బాలీవుడ్
- Comments Off on బాలీవుడ్ బొమ్మ.. కంగనా రనౌత్