Breaking News

బాలయ్య బర్త్​ డే ..‘చిరు’ కోరిక


బుధవారం యువరత్న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. మెగస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇదే ఉత్సాహం..ఉత్తేజంతో 60లో అడుగుపెడుతున్న బాలకృష్ణకు ఆయురారోగ్యాలతో వంద వసంతాల సంబరం కూడా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇలా మెగాస్టార్ బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం అటు ఇండస్ట్రీలోనూ ఇటు బాలయ్య బాబు అభిమానుల్లోనూ ప్రాధాన్యం సంతరించుకుంది. దానికి కారణం ఇటీవల చిత్ర పరిశ్రమకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన కొన్ని కీలక సమావేశాలకు బాలయ్యను పిలవని కారణంగా బాలయ్య చిరుతో పాటు, కొందరు చిత్ర ప్రముఖులను ఉద్దేశించి బాలయ్య కొన్ని ఘాటు విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై నాగబాబు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. దీంతో చిరు, బాలయ్యల మధ్య అంతరం పెరింగిందంటూ పుకార్లు లేవనెత్తుతున్న తరుణంలో చిరంజీవి బాలయ్యకు ఇలా శుభాకాంక్షలు అందజేస్తూ వివాదానికి పుల్​స్టాఫ్​ పెట్టారనిపిస్తోంది. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా ఇద్దరు ఆప్తులన్న విషయం అందరికీ అర్థమయ్యేలా చిరంజీవి స్పందించిన తీరు ఇరువురు అభిమానులు కూడా పాజిటివ్​గా రెస్పాన్స్​ అవుతున్నారు.