డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు మూడో సినిమా మొదలైంది. మొన్న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ కూడా రిలీజైంది. మూడో సినిమా కూడా అంచనాలు పెంచేదిగా ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తాజాగా ఓ కీలకపాత్రలో నటించేందుకు నవీన్ చంద్రను ఎంపిక చేశారట. ‘అందాల రాక్షసి’ సినిమాలో హీరోగా నటించిన నవీన్ ఎన్టీఆర్ సినిమా ‘అరవింద సమేత’ విలన్ క్యారెక్టర్ చేశాడు.
ఆ తర్వాత ‘ఎవరు’ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా క్యారెక్టర్ చేశాడు. తమిళంలో కూడా ధనుష్ మూవీ ‘పటాస్’లో కూడా విలన్ గా నటించాడు. ఇలా హీరోతో పాటు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా నవీన్ అద్భుతంగా పండిస్తాడు. అయితే నిర్మాత అల్లు అరవింద్ కేవలం ‘ఆహా’ ప్లాట్‌ఫాం కోసం నవీన్ చంద్ర, సలోనీ లూథ్రా హీరో హీరోయిన్లుగా ‘భానుమతి రామకృష్ణ’ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఆన్ లైన్లో జూలై 3న స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు బోయపాటి సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం సెలక్టయ్యాడు. ఎన్టీఆర్తో దీటుగా విలన్ క్యారెక్టర్ చేసిన మరి బాలయ్య బాబును ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం.