సారథి న్యూస్, కర్నూలు: దళితుల అభ్యున్నతికి అడుగడుగునా అడ్డుపడే మాజీ సీఎం చంద్రబాబు.. ఉన్నట్టుండి దళితులపై ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నారని లీడర్స్ యూత్ సొసైటీ అధ్యక్షు మాదారపు కేదార్నాథ్ప్రశ్నించారు. తన హయాంలో దళితులపై దాడులు చేయించడంతోపాటు అవమానపరిచేలా మాట్లాడిన వ్యక్తి.. ప్రతిపక్షంలో ఉన్నందుకు వారిపై కపటప్రేమ చూపుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. ఓర్వలేకే చంద్రబాబు అడ్డుపడ్డారని గుర్తుచేశారు. ఇలాగే చేస్తే ఆయనకు మరోసారి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో శివశంకర్, కృష్ణమూర్తి, అంబేద్కర్సంఘం నాయకులు యశ్వంత్, వసంత్, జశ్వంత్, బుడగ జంగ సంఘం నాయకుడు జమన్న, నరసింహ, మా యూత్ సంఘం నాయకుడు శేషు పాల్గొన్నారు.
- August 28, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- CHANDRABABU
- CM YS JAGAN
- YSRCP
- చంద్రబాబు
- వైఎస్సార్సీపీ
- సీఎం వైఎస్జగన్
- Comments Off on బాబు.. దళితులపై ప్రేమెందుకు..?