సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రమాదవశాత్తు మృతిచెందిన ఓ వ్యక్తి కుటుంబానికి చౌటపల్లి గ్రామఅభివృద్ధి కమిటీ రూ.5000 ఆర్థికసాయం అందించింది. కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన గుడిపాటి రాజయ్య హఠాత్తుగా మృతిచెందడంతో అతడి కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. దీంతో శనివారం సర్పంచ్ గద్దల రమేశ్ బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పోశెట్టి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఐలయ్య, వెంకటయ్య, మల్లేశం, రమేష్, త్రిమూర్తి, శంకర్, సురేందర్, రాజ్ కుమార్, బాలయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- June 13, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- HUSNABAD
- KARIMNAGAR
- అభివృద్ధి కమిటీ
- చౌటపల్లి
- Comments Off on బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం