Breaking News

బాధితులకు చెక్కుల పంపిణీ

సారథిన్యూస్, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా గంగాధర మండలానికి చెందిన ఎనిమిది మందికి రూ. లక్ష 98 వేల విలువైన సీఎం సహాయకనిధి చెక్కులను శనివారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్​ మాట్లాడుతూ.. పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.