సారథి న్యూస్, నిజామాబాద్: కరోనా ఎవరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి వీఐపీల దాకా ఎప్పుడు ఎవరికి అంటుంటుందో తెలియడం లేదు. తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయనను హుటాహుటినా చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఇదివరకే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్‌గా రావడంతో ఆయన చికిత్సపొందుతున్నారు. అలాగే మంత్రి హరీశ్‌రావు పీఏకు కరోనా పాజిటివ్ కావడంతో మంత్రి కూడా హోంక్వారంటైన్‌కే పరిమితమయ్యారు. ఈ పరంపరలో హైదరాబాద్ నగర మేయర్‌కు బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనకు కూడా మెడికల్ టెస్టులు చేశారు.
- June 14, 2020
- Archive
- తెలంగాణ
- BAJIREDDY
- GOVARDAN
- కరోనా
- నిజామాబాద్
- Comments Off on ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా