Breaking News

బస్సు సీటు మారింది

లాక్ డౌన్ ఎఫెక్ట్

సారథి న్యూస్​, గోదావరిఖని: లాక్ డౌన్ పాపమా! అని అని జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, దాదాపు 50రోజుల తర్వాత కొన్నిరాష్ట్రాల్లో బస్సులు రోడ్డెక్కుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అది కూడా నిబంధనలతో కూడిన అనుమతి మాత్రమే ఉంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో సాధారణంగా 36 నుంచి 40 సీట్లు మాత్రమే ఉంటాయి. కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో భౌతికదూరం పాటించాల్సి ఉంది. అందుకోసం ఆర్టీసీ తగిన ఏర్పాట్లు చేస్తోంది.

గోదావరిఖని ఆర్టీసీ డిపోలోని ఓ బస్సును ఇలా తయారుచేశారు. అటు ఇటు ఒక సీటు మాత్రమే ఉంచింది. ఇక మధ్యలో నడిచే ప్రాంతంలో మరో సీటును ఏర్పాటుచేసింది. మధ్యలో ఏర్పాటుచేసిన సీటు ఖాళీగా ఉంచింది. ప్రయాణికులు అటు ఇటు ఉన్న సీట్లలో మాత్రమే కూర్చోవాల్సి ఉంటుంది. అంటే 20 నుంచి 26 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా రవాణా సంస్థలు ఈ రకమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో పాటుగా బస్సులో ప్రయాణించే వాళ్లకు ముందుగానే శానిటేషన్, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు.