న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలను సైతం వెంటాడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీ బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్(67) షాకు కరోనా ప్రబలింది. తనకు కరోనా సోకిందని ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు కిరణ్ మజుందార్ షా స్వయంగా ఓ ట్వీట్ చేశారు. తాను త్వరలోనే కోలుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కేసుల లెక్కల్లోకి తాను కూడా చేరానని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రముఖ మహిళల్లో కిరణ్ మజుందార్ షా ఒకరు. ఇటీవల రష్యా తయారుచేసిన వ్యాక్సిన్‌పై ఆమె పలు ప్రశ్నలు సంధించారు. క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను రష్యా ఎందుకు వెల్లడించడం లేదని ఆమె ప్రశ్నించారు. కాగా కిరణ్ తొందరగా కోలుకోవాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ స్వామినాథన్, కాంగ్రెస్ నేత శశి థరూర్ తదితరులు ట్వీట్లు చేశారు.
- August 18, 2020
- Archive
- Top News
- జాతీయం
- BENGALURU
- BIOCAN
- KIRANMAJUNDAR
- PHARMA COMPANY
- కరోనా
- రష్యావ్యాక్సిన్
- Comments Off on బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షాకు కరోనా