ఈ ఏడాది ‘అల వైకుంఠ పురములో’ చిత్రంతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు బన్నీ. వెంటనే కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్‌తో ‘పుష్ప’ చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందాన్న నటిస్తోంది. ఇదిలా ఉండగా, స్టైలిష్ బన్నీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్తొకటి వచ్చింది. మమ్ముటి ప్రధాన పాత్రలో యదుగూరి రాజశేఖర్ రెడ్డి జీవిత్ర చరిత్రను ‘యాత్ర’ చిత్రంగా తెరకెక్కించిన మహి.వి.రాఘవ్ ఈసారి ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి బయోపిక్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. లీడ్ రోల్ చేయమని బన్నీని సంప్రదించాడట. దానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుని ఏపీ సీఎం అయ్యే వరకు జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథనం ఉంటుందట. ఆ పాత్రకు బన్నీ అయితే కరెక్ట్‌గా ఉంటాడని అర్జున్ అప్రోచ్ అయ్యాడట రాఘవ్. అయితే ఈ చిత్రానికి ‘నా పేరు జగన్’ అన్న టైటిల్ కూడా పెట్టనున్నారని టాక్. కానీ దీనికి సంబంధించిన అధికారిక వివరాలేవీ ఇంతవరకూ బయటకు రాలేదు. అందుకే ఈ వార్త నిజమా? కాదా? క్లారిటీ వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.
- July 20, 2020
- Archive
- Top News
- సినిమా
- ALLUARJUN
- AP
- MAHI V RAGHAV
- అల్లు అర్జున్
- బన్నీ
- సీఎం జగన్
- Comments Off on బన్నీ పొలిటికల్ ఎంట్రీ