సారథి న్యూస్, అనంతపురం: కరోనా విజృంభిస్తున్న వేళ.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఎవరికివారు ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఎవరివారు తమ సొంత పనులను చక్కబెట్టుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి పరిటాల సునీత చీనీ, బత్తాయి పండ్లను కోస్తూ తోటలో ఇలా కనిపించారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని నరసంపల్లి గ్రామ సమీపంలో పరిటాల కుటుంబానికి ఉన్న సొంత పొలంలో చీనీ, బత్తాయి తోట ఉంది. ఆమె మాస్క్ కట్టుకుని ఈ తోటలోనే స్వయంగా ఆమె పండ్లు తెంచి ఇంటికి తీసుకెళ్లారు.