కోల్‌కతా: బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తుండగా రూ.35.3 కోట్ల విలువైన 25 పురాతన విగ్రహాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. 2020 ఆగస్టు 23 రాత్రి కస్టమ్స్ అధికారులు పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినజ్‌పూర్ జిల్లాలో 25 పురాతన విగ్రహాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాళిగంజ్ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న వీటిని గుర్తించి అధికారులు పట్టుకున్నారు. భారతదేశ సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించే 25 కళాఖండాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్ని క్రీ.శ.9 నుంచి 16వ శతాబ్దం వరకు చెందిన వస్తువులుగా అధికారులు గుర్తించారు.
- August 26, 2020
- Archive
- Top News
- జాతీయం
- BANGLADESH
- CUSTOMS
- KOLKATA
- కోల్‌కతా
- పశ్చిమబెంగాల్
- పురాతన విగ్రహాలు
- బంగ్లాదేశ్
- Comments Off on బంగ్లాదేశ్‌కు తరలిస్తున్న విగ్రహాలు స్వాధీనం