సారథి న్యూస్, మెదక్ : బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం టీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు.
మండలంలో 108 మంది పారిశుద్ధ్య కార్మికులకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ప్రత్యేక చొరవ చూపిన తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీవో లక్ష్మణమూర్తిని అభినందించారు. కార్యక్రమంలో డీఎల్పీవో జ్యోతి రెడ్డి, జడ్పీటీసీ పట్లోరి మాధవి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ రాధిక, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.