Breaking News

‘బంగారుతల్లి’.. హ్యాపీగా ఉంది

‘బంగారుతల్లి’.. హ్యాపీగా ఉంది

తమిళ, తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో అభిమానులను సొంతం చేసుకున్న జ్యోతిక..సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మరింత దూకుడు పెంచింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ గతంలో కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటోంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘పొన్ మగల్ వందాల్’ కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన విషయం తెలిసిందే. జేజే ఫ్రెడ్రిక్‌ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సూర్య నిర్మించాడు. జ్యోతిక, భాగ్యరాజ్‌, పార్థీబన్‌ కీలకపాత్రలు పోషించారు.

2004 ఊటీలో జరిగిన వరుస కిడ్నాప్‌ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన మూవీలో జ్యోతిక లాయర్ గా నటించింది. రీసెంట్ గా ఈ మూవీ ఓటీటీలో విడుదలై వంద రోజులు కూడా పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ‘బంగారు తల్లి’పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. సైకో కిడ్నాపర్ చేస్తున్న హత్యలను ఛేదించే పనిలో నిమగ్నమవుతారు పోలీసులు, ఈ కేసు వాదించే లాయర్ వెన్నెల పెద్దిరాజుగా నటించింది జ్యోతిక. మర్డర్ మిస్టరీతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. తెలుగు రిలీజ్ పై సూర్య ట్వీట్ చేస్తూ..‘ఈ చిత్రంపై నేను, జ్యోతిక కాన్ఫిడెంట్ గా ఉన్నాం. బంగారుతల్లిగా తెలుగు వెర్షెన్ లో విడుదలవుతున్నందుకు హ్యాపీగా ఉంది’ అన్నాడు.