లండన్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌కు సిద్ధమయ్యేందుకు వీలుగా యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగాలని సెర్బియా స్టార్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ భావిస్తున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 31 నుంచి యూఎస్ ఓపెన్ జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో సన్నాహాకాలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎంపిక చేసిన టోర్నీల్లో మాత్రమే ఆడాలని జొకోవిచ్ యోచిస్తున్నాడు. మరోవైపు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. మిగతా సీజన్‌కు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. మోకాలి గాయానికి చేయించుకున్న ట్రీట్మెంట్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత ఫిబ్రవరిలో ఫెదరర్.. కుడి మోకాలికి ఆర్థోస్కోపి శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం అతను పునరావస చికిత్స తీసుకుంటున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించాకా.. వచ్చే సీజన్‌కు అందుబాటులోఉంటానని ఫెదరర్ వెల్లడించాడు.
- June 11, 2020
- Archive
- Top News
- క్రీడలు
- DJOKOVIC
- FRENCH OPEN
- ఫెదరర్
- యూఎస్ ఓపెన్
- Comments Off on ఫ్రెంచ్ కోసం యూఎస్‌కు జొకోవిచ్ డుమ్మా