Breaking News

‘ఫ్యామిలీ ప్యాక్’ మోషన్ పోస్టర్ రిలీజ్

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పీఆర్​ కే ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకే తన ఐదవ సినిమాగా ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లిఖిత్ శెట్టి, అమృత అయ్యంగార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ గా ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఓ కాంటెస్ట్ కూడా పెట్టింది యూనిట్.

ఫ్యామిలీ ప్యాక్

‘ఫ్యామిలీ ప్యాక్’ మూవీ మోషన్ పోస్టర్ ను చూసి అక్కడ కనిపిస్తున్న జంట రిలేషన్ ఏమిటో గెస్ చేసి ట్విట్టర్ లో కామెంట్ చేసిన ఐదుగురికి జేబీఎల్ స్పీకర్లను అందజేస్తుంది మూవీ టీం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక ‘ఫ్యామిలీ ప్యాక్’ సినిమా థియేటర్స్ ఓపెన్ అవ్వగానే ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతుంది.