Breaking News

ఫైరింగ్​లో ట్రైనింగ్​

ట్రైనింగ్​లో పాల్గొన్న పోలీసు అధికారులు


సారథి న్యూస్​, ఖమ్మం: మానసికంగా, శారీరకంగా దృఢత్వం కలిగి ఉన్నప్పుడే లక్ష్యాన్ని సులభంగా చేధించవచ్చని పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ అన్నారు. సిటి ఆర్మ్​డ్ పోలీస్ సిబ్బందికి ఏటా జరిగే వార్షిక రిఫ్రెష్ కోర్స్ శిక్షణలో భాగంగా సీనియర్, జూనియర్స్ మొత్తం 350 మంది సిబ్బందికి శుక్రవారం రఘునాథపాలెం మండలం మంచుకొండ పోలీస్ ఫైరింగ్ రేంజ్ లో వెపన్ ప్రాక్టీస్ చేయించారు. పోలీస్ కమిషనర్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రతిభచూపిన వారిని కమిషనర్​ అభినందించారు. కార్యక్రమంలో ఏఆర్​ అడిషనల్ డీసీపీ మాధవరావు, ఏఆర్ ఏసీపీ విజయబాబు పాల్గొన్నారు.