సారథి న్యూస్, రామడుగు: కరోనాతోపాటూ అన్ని రకాల రోగాలు దరిచేరకుండా ఉండాలంటే వ్యాయమం ఎంతో అవసరమని సూచిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన యువకులు ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ఓ గంట సేపు అందరూ వ్యాయామం చేసేలా ‘ఫిట్రామడుగు’ అనే కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో చేరిన యువకులంతా ప్రతి రోజు స్థానిక ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో వాకింగ్, రన్నింగ్, యోగా చేస్తున్నారు. అంతేకాక వీరు ఓ వాట్సప్గ్రూప్ను ఏర్పాటుచేసుకొని అందులో ఆరోగ్యం, యోగ, వ్యాయామాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
- July 10, 2020
- Archive
- కరీంనగర్
- షార్ట్ న్యూస్
- FITNESS
- KARIMNAGAR
- WALKING
- కరీంనగర్
- ఫిట్నెస్
- రామడుగు
- Comments Off on ఫిట్నెస్తో రోగాలు దూరం