సారథిన్యూస్: అతడో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. తన ఆఫీసులోనే పనిచేసే ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి ప్రేమను.. ఆమె తిరస్కరించడంతో కక్ష పెంచుకొని లోకాంటో అనే యాప్‌లో యువతికి చెందిన ఫొటోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. దీంతో ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ టెకీ కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ కు చెందిన అందె వంశీ(25) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిని కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. ఆమె ప్రేమను తిరస్కరించడంతో కక్ష పెంచుకున్న వంశీ యువతి ఫొటోను, ఫోన్ నంబర్‌ను లోకాంటో అనే యాప్‌లో పెట్టి ఆమెను వేధించాడు. యువతి గోదావరిఖని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సైబర్ క్రైం పోలీసుల సహకారంతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అతడి లోకేషన్‌ను గుర్తించిన పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు.
- June 20, 2020
- Archive
- క్రైమ్
- HYDERABAD
- IT
- LOVE
- SOFTWARE
- వంశీ
- సైబర్ క్రైం
- Comments Off on ప్రేమించలేదని పగబట్టాడు