యంగ్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్లోనే కాపురం పెట్టింది. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఎంజాయ్ చేస్తోంది. అయితే పెళ్లయ్యాకా ప్రియాంక అసలు ఇండియన్ సినిమాల్లో కనిపించడం మానేసి హాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఇంగ్లీష్ సీరియల్స్.. వెబ్ సిరీస్ లు పైనే తన దృష్టి మొత్తం పెట్టింది. పూర్తిగా ఫారెన్ అమ్మాయిలా మారిపోయి కట్టు బొట్టు వాలకం అన్నీ పాశ్చాత్య సంస్కృతినే ఫాలో అవుతోంది కూడా. ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా.. ఆ మాత్రం వయలు ఉంటుందిలే అని అంతా అనుకుంటున్నారు. అయితే ప్రియాంక తాజాగా అభిమానులకు ఓ భారీ న్యూస్ చెప్పింది. తను అమెజాన్ తో మల్టీ మిలియన్ డాలర్లు విలువ చేసే భారీ డీల్ కుదుర్చుకున్నానని.. ‘ఫస్ట్ లుక్’ టెలివిజన్ డీల్ కోసం రెండేళ్ల పాటు అమెజాన్ తో కలిసి పనిచేయనున్నానని అంటోంది. ఈ సందర్భంగా ప్రియాంక ట్విట్టర్ లో ‘ఓ నటిగా నిర్మాతగా.. భాష ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రపంచంలోని ప్రతిభ అంతా ఒక చోట చేరి గొప్ప కంటెంట్ ను సృష్టించాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. నా నిర్మాణ సంస్థ ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు అమెజాన్ తో కలిసి పనిచేస్తుండడం దానికి నాందిగా మారుతుందని అనుకుంటున్నాను’ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అమెజాన్ లాంటి భారీ సంస్థతో డీల్ కుదుర్చుకున్నందుకు ప్రియాంక అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమ అభినందనలు తెలుపుతున్నారు.
- July 2, 2020
- Archive
- సినిమా
- HOLLYWOOD
- PRIYANKACHOPRA
- నిక్ జోనస్
- ప్రియాంకచోప్రా
- స్నాప్డీల్
- హాలీవుడ్
- Comments Off on ప్రియాంక బిగ్ డీల్