Breaking News

ప్రియాంక ఎంట్రీతో మారిన సీన్​

జైపూర్​/ ఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ఎంట్రీతో రాజస్థాన్​లో సీన్​ మారినట్టు సమాచారం. ఆ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్ తిరుగుబాటు చేసి,​ తనవైపు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడంతో రాజస్థాన్​లో ఆసక్తికర పరిణామాలు చోటచేసుకున్నాయి. కాగా సచిన్​ పైలట్​ బీజేపీతో చేతులు కలిపారని ఆరోపణలు వినిపించాయి. కాగా సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం సుముఖంగా లేకవడంతో సచిన్​ పైలట్​ ప్రాంతీయపార్టీ పెట్టేందుకు సిద్ధపడ్డారని ఓ దశలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా ప్రియాంకగాంధీతో సచిన్​ పైలట్​ జరిపిన చర్చలు ఫలించినట్టు సమాచారం. సచిన్​ డిమాండ్లకు కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించినట్టు సమాచారం.​ దీంతో సచిన్​ పైలట్​ మెత్తబడ్డట్టు సమాచారం. అశోక్​ గెహ్లాట్​, పైలట్​ మధ్య ప్రియాంకగాంధీ రాజీ కుదిర్చినట్టు తెలుస్తున్నది. పార్టీ చీఫ్‌గా తనను కొనసాగించడంతో పాటు తన వర్గానికి నాలుగు మంత్రి పదవులు, కీలక ఆర్థిక, హోంశాఖలను కట్టబెట్టాలని సచిన్​ కోరారు. ఈ విషయంపై పార్టీ నేతలు ఇరు వర్గాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అంతకుముందు ఢిల్లీ, జైపూర్‌ వేదికగా పార్టీలో రాజకీయ హైడ్రామా చోటుచేసుకున్నది. తన ప్రభుత్వం మైనారిటీలో పడలేదని, తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం గెహ్లాట్​ స్పష్టం చేయడంతో నంబర్‌ గేమ్‌పై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రణదీప్‌ సుర్జేవాలా మండిపడ్డారు. ఇక 200 మంది సభ్యులున్న రాజస్థాన్​ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో సీఎల్పీ భేటీపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.