సారథి న్యూస్, హుస్నాబాద్: రోడ్లపై గుంతలు ఎక్కువగా పడడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే గుంతలను పూడ్చాలని కాంగ్రెస్ హుస్నాబాద్ మండలాధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ అన్నారు. రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. హన్మకొండ నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రానికి వెళ్లే మెయిన్‌రోడ్డు దెబ్బతినడంతో నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అన్నారు. ఆ గుంతల్లో జూలై 7న జెండాలు పాతి నిరసన తెలిపినా మంత్రి, అధికారులకు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి మరమ్మతులు పనులు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పద్మ, కౌన్సిలర్లు స్వర్ణలత, సరోజన, రాజు, శ్రీనివాస్, రాజు, కిష్టస్వామి, చందు, వెంకన్న, వెంకటేశ్వర్లు, శంకర్, సుధాకర్, వెంకట్, శ్రీనివాస్, శ్రీకాంత్, సాగర్, రంజిత్ పాల్గొన్నారు.
- October 3, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CONGRESS
- HUSNABAD
- ROAD REPAIRE
- కాంగ్రెస్
- రోడ్ల మరమ్మతులు
- హుస్నాబాద్
- Comments Off on ప్రాణాలు పోతున్నయ్.. గుంతలు పూడ్చండి