డార్లింగ్ ప్రభాస్ వరుసగా చిత్రాలను అనౌన్స్ చేసి ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహాన్ని రిక్రియేట్ చేశాడు. ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్ నటించనున్న భారీ ఇతిహాస చిత్రం ‘ఆది పురుష్’ మూవీకి సంబంధించిన ఒక అప్ డేట్ రానుంది. ‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. టీ సీరీస్ బ్యానర్‌పై అత్యంత భారీస్థాయిలో భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. ఇందులో కలియుగ రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ ఓం రౌత్ అనౌన్స్ చేసినప్పటి నుంచి రోజుకో అప్ డేట్ వస్తుందన్న విషయాన్ని కూడా చెప్పారు. దీంతో అది ఏమిటా? అని ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూసింది.
అయితే ఓం రౌత్ చెప్పిన సమయానికే సరిగ్గా 7 గంటల 11 నిమిషాలకు ఆ అప్డేట్ను రివీల్ చేసారు. ‘ఏడువేల క్రితం కితం ప్రపంచంలో అత్యంత తెలివైన రాక్షకుడు ఉద్భవించాడు’అని ట్వీట్ చేశారు. ఇదైతే మాత్రం ఈ మూవీ లో రావణాసురుడి పాత్రను పరిచయం చేయడమే అనిపిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి ఈ చిత్రంలో బాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ నటుడు విలన్ పాత్రలో కనిపించనున్నారని బజ్ వినిపిస్తోంది. అది కూడా సైఫ్ అలీ ఖాన్ పేరే వినిపించింది. ఇప్పుడు అతన్ని కూడా ఓంరౌత్ ట్యాగ్ చేసి సైఫ్ ను లంకేశుడిగా చూపించనున్నట్టు ఖరారు చేశారు. ఈ భారీ చిత్రాన్ని ఓంరౌత్ రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో 3డీలో తెరకెక్కించనున్నారు. హీరోయిన్ ఎవరన్నది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.