ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్తసినిమా పోస్టర్, న్యూలుక్ విడుదలైంది. ఈ పోస్టర్ ఎంతో రొమాంటిక్ గా ఉందంటూ అభిమానులు, సినీప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే బయటకు లీక్ అయిన ‘రాధేశ్యామ్’ అనే టైటిల్ నే ఖరారు చేశారు. కాగా ప్రభాస్ న్యూలుక్ ఎంతో ఎంతో రొమాంటిక్ ఉందని, హీరోయిన్ పూజాహేగ్డే కూడా అందంగా కనిపిస్తున్నదని పోస్టర్ చూసిన అభిమానులు, యువత తెగ సంబరపడిపోతున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాను కూడా ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా ప్యాన్ ఇండియా మూవీగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నది. 1960 దశకం నాటి ప్రేమకథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళీ శర్మ, సాషా ఛేత్రి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ పోస్టర్ గతంలో సాయిధరమ్ తేజ్ నటించిన కంచె పోస్టర్ను పోలీఉందంటూ పలువురు నెట్జన్లు ట్రోలింగ్ మొదలుమెట్టారు.