Breaking News

ప్రణబ్​ ముఖర్జీ కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ముఖర్జీ (84) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనాతో ఈ నెల 10న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరినప్పటినుంచి ప్రణబ్​ ఆరోగ్యం విషమంగానే ఉన్నది. ఆయనకు ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్​ఫెక్షన్​ అయినట్టు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించామని చెప్పారు. ఆయన ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ప్రణబ్​ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్​ అధినేత్రి సోనియా, యువనేత రాహుల్​ తదితరులు సంతాపం తెలిపారు.