న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ (84) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నదని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందుతున్నారు. శరీర అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని.. గుండె నుంచి శరీర భాగాలకు రక్త సరఫరా సాధారణంగానే ఉందని వివరించారు. ఇటీవల ఆయనకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. అనంతరం ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది.
అభిమానుల ప్రార్థనలే బతికిస్తాయి
ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. అలాంటి వార్తలను నమ్మొద్దని ప్రణబ్ కుమార్తె షర్మిష్టా ముఖర్జీ స్పష్టం చేశారు. ఆ వదంతులను చూసి.. తమకు అనేక మంది కాల్ చేస్తున్నారని, ఆ కాల్స్ నుంచి ప్రశాతంగా ఉండాలని కోరుకుంటున్నానని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
- August 14, 2020
- Archive
- Top News
- జాతీయం
- DELHI
- FAMILY MEMBERS
- HEALTHBULLETIN
- PRANAB MUKHARJEE
- SERIOUS
- ఆరోగ్యం
- ప్రణబ్‌ముఖర్జీ
- విషమం
- Comments Off on ప్రణబ్ ఆరోగ్యం.. అత్యంత విషమం