సారథి న్యూస్, శ్రీకాకుళం: బీజేపీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ సచివాలయ ఆవరణలో సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు దావాల రమణారావు, ఎన్ఏ రాజపురం శాఖ కార్యదర్శి అర్తమూడి లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్ టీ అమలు దేశప్రజల ఆర్థిక పరిస్థితిని తీరోగమనంలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా లాక్డౌన్విధించి వలస కార్మికుల ఆకలి చావులకు కారణమయ్యారని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందన్నారు. కార్యక్రమంలో సుగంధం నారాయణరావు, కాదా రాము, దూసి లక్ష్మణరావు, మల్లవరపు రమేష్ పాల్గొన్నారు.
- September 22, 2020
- Archive
- లోకల్ న్యూస్
- శ్రీకాకుళం
- షార్ట్ న్యూస్
- BJP
- CPM AGITATION
- PALAKONDA
- SRIKAKULAM
- పాలకొండ
- బీజేపీ
- శ్రీకాకుళం
- సీపీఎం
- Comments Off on ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి