సారథి న్యూస్, కర్నూలు: మూడు రాజధానులు, ఇళ్లపట్టాల పంపిణీ, కర్నూలులో న్యాయరాజధాని.. తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మాజీ సీఎం చంద్రబాబునాయుడు అడుగడుగునా అడ్డుపడుతున్నారని నిరసిస్తూ బుధవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పాణ్యం, కర్నూలు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ఖాన్పాల్గొన్నారు. చంద్రబాబు కేవలం అమరావతి పేరుతో ఆ ప్రాంతంలో తన బినామీలు, సొంత సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చడానికి మాత్రమే ఆలోచిస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు కనీసం ప్రజాస్వామ్య విలువలు, ప్రజల అభిప్రాయానికి సైతం గౌరవం ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- August 27, 2020
- Archive
- AMARAVATHI
- CHANDRABABUNAIDU
- Kurnool
- TELANGANA
- అమరావతి
- కర్నూలు
- చంద్రబాబు
- తెలంగాణ
- Comments Off on ప్రజల ఆకాంక్షలను అడ్డుకోవడం బాబు నైజం