సారథి న్యూస్, కర్నూలు: కరోనా ప్రబలుతున్న సమయంలో ప్రజలను ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా ఆదివారం కర్నూలు నగరంలోని ముజఫర్ నగర్, ఇందిరాగాంధీ నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, బాలగంగాధర్ తిలక్ నగర్, కల్లూరు, కృష్ణానగర్, షరీన్ నగర్, సీ క్యాంప్ సెంటర్, సోమిశెట్టి నగర్, బీటీఆర్ నగర్, మమతానగర్, అశోక్ నగర్, బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండ్ కూడళ్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి కుటుంబానికి రూ.7,500 ఆరునెలలపాటు ఇవ్వాలని, మనిషికి పది కేజీల బియ్యాన్ని ఇవ్వాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల, న్యూసిటీ కార్యదర్శి టి.రాముడు, సీహెచ్ సాయి బాబా, ఎం.నాగరాజు. ఎం.గోపాల్. కె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.