సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండియన్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్సమావేశ మందిరంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ జి.వీరపాండియన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, జేసీ3(సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ.. తమిళనాడు, సమైక్యాంధ్ర రాష్ట్రాలకు తొలి సీఎంగా ఎన్నికై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కర్నూలు రాజధానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు అందించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో డీఆర్వో పుల్లయ్య, బీసీ సంక్షేమ అధికారి గూడుభాయి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు భాగ్యరేఖ, డీపీవో ప్రభాకర్ రావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి రమాదేవి, మైనార్టీ సంక్షేమ అధికారి మహబూబ్ బాషా పాల్గొన్నారు.