సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట నూతన పోలీస్ కమిషనరేట్ పనులను తొందరగా పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామశివారులో నిర్మిస్తున్న కొత్త పోలీస్ కమిషనరేట్ పనులను ఆదివారం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తో కలిసి పరిశీలించారు. హైవేకు ఆనుకుని కమిషనరేట్‌కు వచ్చేలా దారి అంశంపై పోలీస్ అధికారులతో చర్చించారు. 7.30 ఎకరాల విస్తీర్ణంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్, పోలీస్ క్వార్టర్స్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్తదితర నిర్మాణ పనులపై మంత్రి ఆరాతీశారు. వారి వెంట అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ రావు, గజ్వేల్ ఏసీపీ నారాయణ, తోగుట సీఐ రవీందర్, బేగంపేట ఎస్సై విజయ్ కుమార్ పాల్గొన్నారు.
- August 16, 2020
- Archive
- తెలంగాణ
- మెదక్
- MINISTER HARISHRAO
- POLICE COMMISSIONER
- SIDDIPETA
- పోలీస్ కమిషనర్
- సిద్దిపేట
- హరీశ్‌రావు
- Comments Off on పోలీస్ కమిషనరేట్‌ను కంప్లీట్ చేయండి