నల్లగొండ: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పోలీస్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ నర్మద సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రీడ్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి డాక్టర్ అనూష ఆధ్వర్యంలో జిల్లాలోని 2000 మంది పోలీస్సిబ్బందికి రోగనిరోధకశక్తిని పెంచే హోమియో మందలను అందించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సీఐ రమేశ్, సత్యం, డీపీవో సూపరింటెండెంట్ దయాకర్, ఆర్ఐ నర్సింహాచారి, డీటీఆర్సీ సీఐ అంజయ్య, కార్తీక్, శంకర్, నవీన్, అజీజ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
- July 13, 2020
- Archive
- నల్లగొండ
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- HOMEO
- MEDICINE
- NALGONDA
- POLICE
- కరోనా
- పోలీస్
- Comments Off on పోలీసులు జాగ్రత్తగా ఉండాలి