Breaking News

పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం

సారథిన్యూస్​, బిజినేపల్లి/రామడుగు: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అధిక విద్యుత్​చార్జీలు వసూలుచేస్తూ పేదల నడ్డి విరుస్తున్నదని కాంగ్రెస్​పార్టీ నేతలు ఆరోపించారు. కరెంటు బిల్లులపెంపునకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల కాంగ్రెస్​ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నాగర్​కర్నూల్​​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సబ్​స్టేషన్​ వద్ద కాంగ్రెస్​ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని గుండి సబ్​స్టేషన్​ ఆవరణలోనూ కాంగ్రెస్​ నేతలు నిరసన చేపట్టారు. ధనికరాష్ట్రమంటు గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్​.. ఇప్పుడు విద్యుత్​ చార్జీలు ఎందుకు పెంచారని ఆరోపించారు. ఆయా కార్యక్రమాల్లో చొప్పదండి నియోజక వర్గ ఇంచార్జ్ మెడిపల్లి సత్యం, కాంగ్రెస్ నాయకులు సుఖాసనంరెడ్డి , అంజి యాదవ్, గోపాల్ రెడ్డి , పాష , మల్లేశ్​, బాలరాజు, ఈశ్వర్, బొమ్మర వేణి తిరుపతి, కోల రమేశ్​, సత్య ప్రసన్న, కాడే శంకర్, బాపిరాజు, నాగరాజు, రాములు గౌడ్, సిరాజుద్దీన్, ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, బాలా గౌడ్, సహు ఉదయ్, మాణిక్యం, కిట్టురెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.