Breaking News

పేదల కోసం జగనన్న పథకాలు

పేదల కోసం జగనన్న పథకాలు

సారథి న్యూస్, కర్నూలు: వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా శనివారం కర్నూలు నగరంలోని జొహరాపురంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, జగన్న గోరుముద్దు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభాష తదితర పథకాలు పేదల కోసమే అమలుచేస్తున్నారని వివరించారు. 161 స్వయం సహాయక సంఘాలకు రూ.4,17,87,908ను నాలుగు విడతల్లో జొహరాపురంలో ఇస్తున్నామని తెలిపారు. మొదటి విడత రూ.1,04,46,977ను 161 స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్నామని వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్​ జగన్ మోహన్​రెడ్డిని కలిసి కర్నూలు పరిస్థితిని వివరించానని చెప్పారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.