Breaking News

పెళ్లి పీటలెక్కిన చైతూ, సాయిపల్లవి!

పెళ్లి పీటలెక్కిన చైతూ, సాయిపల్లవి!

నాగచైతన్య, సాయిపల్లవి పెళ్లి పీటలెక్కారు. ఈ తంతు అంతా వీరిద్దరూ నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా కోసమేనండోయ్..​ మరేది కాదు! ప్రముఖ సినీ డైరెక్టర్​ శేఖర్ కమ్ముల విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే క్యూట్‌ లవ్‌ స్టోరీని రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్​గా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని సినిమాలోని స్టిల్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు గెటప్స్‌లో చూడముచ్చటగా ఉన్న చైతూ, సాయిపల్లవి స్టిల్ ఆకట్టుకుంటోంది. ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో పండుగ కళ తెచ్చినట్టుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కె.నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలకపాత్రలు పోషించారు.