Breaking News

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: పెట్రోల్​, డిజిల్​ ధరలను వెంటనే డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి డిమాండ్​ చేశారు. సోమవారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​ ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ.. కరోనాతో ఉపాధిలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్​, డిజిల్​ ధరలు పెంచడం సరికాదన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుంటే పెట్రో ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ హాసన్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పద్మ, కౌన్సిలర్లు సరోజన, రాజు, నాయకులు శ్రీనివాస్, వెంకన్న, సింగరి, రాజిరెడ్డి, రాజు, భరత్ తదితరులు పాల్గొన్నారు.